Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

పౌరసత్వ సవరణ బిల్లు-2019

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పౌరసత్వ సవరణ బిల్లు-2019కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్‌ నుచి...


కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పౌరసత్వ సవరణ బిల్లు-2019కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్‌ నుచి వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరస్వత్వం ఇచ్చేందుకు ఈ బిల్లు ఉద్దేశించారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇవాళ లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం చర్చ జరిగింది. బిల్లు వల్ల మతపరమైన మైనారిటీలు- హిందువులు, జైనులు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, పార్శీలు కూడా భారత పౌరసత్వం పొందుతారని చెప్పారు.  

ఈ బిల్ పట్ల ప్రతిపక్షాల అభ్యంతరాలను కొట్టిపారవేస్తూ   ప్రతిపాదిక చట్టం అసోంకు మాత్రమే పరిమితం కాదని, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకూ, కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తిస్తుందని చెప్పారు. ఈ బిల్లుతో దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా లబ్ధిదారులు నివసించేందుకు వెసులుబాటు ఉంటుందని పేర్కొన్నారు. కాగా, 2016లోనే ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టి, ఆ తర్వాత జేపీసీకి పంపారు. జేపీసీ సోమవారంనాడు నివేదిక అందజేసింది. జేపీసీ సిఫారసుల మేరకు తాజా బిల్లును ఇవాళ లోక్‌సభలో కేంద్రం ప్రవేశపెట్టింది. చర్చానంతరం బిల్లు సభామోదం పొందింది.
పౌరసత్వ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెడుతూ పొరుగు దేశాల నుంచి భారత్‌కు వచ్చే శరణార్థుల అందరి కోసం అని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.  పశ్చిమ సరిహద్దుల నుంచి కూడా చాలా మంది శరణార్థులు రాజస్థాన్‌, పంజాబ్‌, దిల్లీ లాంటి రాష్ట్రాలకు వస్తున్నారని చెబుతూ వారందరి కోసమే ఈ బిల్లును తీసుకు వస్తున్నట్లు చెప్పారు. అసోం ప్రజల హక్కులను ప్రభుత్వం ఎల్లప్పుడూ కాపాడుతుందని భరోసా నిచ్చారు. 
పాకిస్థాన్‌, ఇతర పొరుగు దేశాల్లో మైనార్టీలు తీవ్ర హింసను ఎదుర్కొంటున్నారు. వారంతా ఆశ్రయం కోసం భారత్‌ వైపు చూస్తున్నారు. అలాంటి వారి కోసం ఈ సవరణ బిల్లును తీసుకొచ్చామని వివరించారు. అయితే ఇటీవలి కాలంలో ఇది వివాదాలకు దారితీసిందని, దీనిపై అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని హోమ్ మంత్రి విచారం వ్యక్తం చేశారు. 
అయితే ఈ బిల్లుపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ నుంచి వ్యతిరేకత ఎదురైంది. ఈ సవరణ వల్ల అసోంలో పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతాయని దీన్ని ఎంపిక కమిటీకి పంపించాలని ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే డిమాండ్‌ చేశారు. అయితే ఇందుకు స్పీకర్‌ సుమిత్రా మహజన్‌ నిరాకరించారు. దీంతో ప్రభుత్వం తీరును నిరసనగా కాంగ్రెస్‌ ఎంపీలు సభ నుంచి వాకౌట్‌ చేశారు.
అటు తృణమూల్‌ కాంగ్రెస్‌ కూడా పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకించింది. బిల్లు ఆమోదం పొందితే అసోం సహా ఈశాన్య రాష్ట్రాలు భగ్గుమంటాయని తృణమూల్‌ ఎంపీ సౌగతా రాయ్‌ హెచ్చరించారు.