Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

బుల్లెట్లను దారి మళ్లించే అధునాతన హెల్మెట్ అభివృద్ధి చేసిన టెక్నోట్రియాన్ సంస్థ - Technotreon develops bullet redirecting helmet

పుణెకు చెందిన రక్షణ రంగ సంస్థ టెక్నోట్రియాన్ ఒక సరికొత్త బాలిస్టిక్ హెల్మెట్ ను అభివృద్ధి చేసింది. ఈ హెల్మెట్ తనపైకి వచ్చే బుల్లెట్లను దారి...

బుల్లెట్లను దారి మళ్లించే అధునాతన హెల్మెట్ అభివృద్ధి చేసిన టెక్నోట్రియాన్ సంస్థ

పుణెకు చెందిన రక్షణ రంగ సంస్థ టెక్నోట్రియాన్ ఒక సరికొత్త బాలిస్టిక్ హెల్మెట్ ను అభివృద్ధి చేసింది. ఈ హెల్మెట్ తనపైకి వచ్చే బుల్లెట్లను దారి మళ్లించగలదని సంస్థ తెలిపింది. దీనివల్ల సైనిక, పోలీసు సిబ్బందికి లభించే రక్షణ మరింత మెరుగవుతుందని పేర్కొంది.

సాధారణంగా బాలిస్టిక్ హెల్మెట్లు బుల్లెట్ చొచ్చుకుపోకుండా నిరోధించడంపై మాత్రమే దృష్టి పెడతాయి. అయితే ఈ నూతన ఆవిష్కరణ ద్వారా బుల్లెట్లు హెల్మెట్ ను తాకిన తర్వాత పక్కకు మళ్లేలా చేస్తాయి. దీనిద్వారా బుల్లెట్లోని శక్తిని ధరించిన వ్యక్తికి బదిలీ కాకుండా అడ్డుకోవచ్చని తెలిపారు.

ఇండియన్ పేటెంట్ నెం. 202011048626 ప్రకారం ఈ హెల్మెట్ బుల్లెట్లను దారి మళ్లిస్తుందని వెల్లడించారు. హెల్మెట్ లో శక్తిని పీల్చుకునే, బుల్లెట్లను దారి మళ్లించే ఏర్పాట్లు ఉన్నాయని పేటెంట్ లో పేర్కొన్నారు. అయితే ఎంతటి కాలిబర్ కలిగిన బుల్లెట్లను తట్టుకుంటుంది, ఏ వేగంతో దూసుకొచ్చే బుల్లెట్లను ఆపగలదు అనే నిర్దిష్ట సమాచారం మాత్రం ఆ పేటెంట్ లో లభించలేదని తెలిపారు.

సైనిక, పోలీసు విభాగాలలో సిబ్బంది బాలిస్టిక్ ముప్పును ఎదుర్కొనే వివిధ రంగాలకు ఇది ఉపయోగపడుతుంది. స్టాండర్డ్ సైనికులతో పాటు ప్రత్యేక బలగాలు, సరిహద్దు ప్రాంతాల్లో పనిచేసే సిబ్బందికి వ్యక్తిగత రక్షణ పరికరాల్లో ఇది ముఖ్యం కానుంది. అయితే ఇది ఎంతవరకు పనిచేస్తుందనేది నిర్ధారించడానికి, సరైన రక్షణ ప్రమాణాలకు అనుగుణంగా ఉందో లేదో తెలుసుకోవడానికి విస్తృత స్థాయి పరీక్షలు అత్యవసరమని తెలిపారు.