రష్యా రాజధాని మాస్కోలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భారతీయ పాఠశాల విద్యార్థి రాహుల్ జాన్ అజు సెల్ఫీ దిగ...
రష్యా రాజధాని మాస్కోలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భారతీయ పాఠశాల విద్యార్థి రాహుల్ జాన్ అజు సెల్ఫీ దిగారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో 17 ఏళ్ల ఈ యువకుడు ఒక్కసారిగా రాత్రికి రాత్రే సంచలనంగా మారారు.
కేరళకు చెందిన రాహుల్ జాన్ అజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్లాట్‌ఫామ్‌ల రూపకర్తగా, వ్యవస్థాపకుడిగా గుర్తింపు పొందారు. ఆయన 'థింక్ క్రాఫ్ట్' అనే గేమిఫైడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించడంతో పాటు ఏఐ రియల్మ్ టెక్నాలజీస్ సంస్థను స్థాపించారు.
మాస్కోలో నవంబర్ 26 నుంచి 28 వరకు ఏఐ జర్నీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నవంబర్ 26న జరిగిన ప్లీనరీ సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, కజకిస్థాన్ అధ్యక్షుడు కస్సమ్-జోమార్ట్ టోకాయెవ్ పాల్గొనగా, ఈ సమావేశానికి హాజరైన యువ ఏఐ ప్రతిభావంతులలో రాహుల్ ఒకరని రష్యా రాయబార కార్యాలయం తెలిపింది.
సమావేశం అనంతరం పుతిన్‌ను కలిసిన రాహుల్ జాన్ అజు తనతో సెల్ఫీ దిగాలని కోరగా, రష్యా అధ్యక్షుడు వెంటనే అంగీకరించారు. ఈ సదస్సులో భారత్, రష్యా, కజకిస్థాన్, చైనా, సెర్బియా, బ్రెజిల్ దేశాల నుంచి 300 మందికి పైగా నిపుణులు పాల్గొన్నారు.