రష్యా భారత్‌కు 500 సుఖోయ్-57 ఐదో తరకం యుద్ధ విమానాలను అందించే ప్రతిపాదన చేయగా, ఇది చైనా ఆన్‌లైన్ రక్షణ వర్గాల్లో విస్మయం కలిగించింది. ఈ ఆఫర...

రష్యా భారత్‌కు 500 సుఖోయ్-57 ఐదో తరకం యుద్ధ విమానాలను అందించే ప్రతిపాదన చేయగా, ఇది చైనా ఆన్‌లైన్ రక్షణ వర్గాల్లో విస్మయం కలిగించింది. ఈ ఆఫర్‌పై చైనా విశ్లేషకులు ఎద్దేవా చేస్తూ వ్యాఖ్యలు చేశారు.
రష్యన్ సెంటర్ ఫర్ అనాలసిస్ ఆఫ్ వరల్డ్ ఆర్మ్స్ ట్రేడ్ ప్రచురించిన పత్రం ప్రకారం, భారత్ నేరుగా రష్యా నుంచి 50 సుఖోయ్-57ఈ ఫైటర్లను కొనుగోలు చేసి, ఆ తర్వాత మరో 450 విమానాల లైసెన్స్డ్ ఉత్పత్తిని ప్రవేశపెట్టాలని సూచించింది. రెండు సీట్ల సుఖోయ్-57డీ కూడా ఈ స్వదేశీ విమానాల కాఫ్లేట్‌లో ఉండవచ్చని తెలిపింది.
2030 నాటికి చైనా, పాకిస్థాన్ సంయుక్తంగా దాదాపు 600 ఐదో తరకం యుద్ధ విమానాలను సమకూర్చుకునే అవకాశం ఉందని సీఏడబ్ల్యూఏటీ అంచనా వేసింది. భారత అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ అభివృద్ధి, ఉత్పత్తి దశల్లో ప్రాంతీయ సామర్థ్య అంతరాన్ని ఎదుర్కోవడానికి పెద్దఎత్తున సుఖోయ్ విమానాల కాఫ్లేట్ ఉపయోగపడుతుందని పేర్కొంది.
చైనా ఆన్‌లైన్ వ్యాఖ్యాతలు ఈ ప్రతిపాదనను బహిరంగంగా సవాలు చేశారు. రష్యా ఎగుమతులను పెంచుకోవడానికి, ఫైటర్ ప్రోగ్రామ్ ఫైనాన్స్‌ను బూస్ట్ చేయడానికి ఈ ప్రతిపాదనను తెచ్చిందని చైనా కామెంట్లు అభివర్ణించాయి. 500 విమానాల సంఖ్య కేవలం ఒక బేరసారాల చిప్‌గా ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు.
భారత్ ప్రస్తుత బలగాల నిర్మాణానికి ఈ భారీ విమానాల సంఖ్య సరిపోదని విమర్శించారు. ఒకే విదేశీ డిజైన్ కలిగిన 500 విమానాలను నడపడానికి భారత్‌కు భారీ నిర్వహణ, విడిభాగాలు, శిక్షణ, విస్తృతమైన ఆయుధ మద్దతు అవసరమవుతాయని తెలిపారు. రష్యా ఈ స్థాయిలో విమానాలను ఉత్పత్తి చేయగలదా లేదా అనేదానిపై తీవ్రమైన సందేహాలు వ్యక్తమయ్యాయి.
రష్యన్ ఏరోస్పేస్ ఫోర్సెస్ 2020 నుంచి 2026 ప్రారంభం వరకు సుమారు 48 కొత్త విమానాలను పొందిందని సీఏడబ్ల్యూఏటీ గణాంకాలు తెలపగా, యూకేకు చెందిన రాయ్ యునైటెడ్ సర్వీసెస్ ఇన్‌స్టిట్యూట్ మాత్రం 2020 నుంచి 2025 మధ్య రష్యాకు దాదాపు 20 కొత్త సుఖోయ్-57లు మాత్రమే దక్కాయని, అంటే ఏడాదికి సగటున 4 మాత్రమే వచ్చాయని పేర్కొన్నది.