Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

పాకిస్థాన్ వెబ్ సిరీస్‌లను భారత్‌లో ప్రసారం చేయవద్దు: నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం ఆదేశం - Centre Directs Netflix Not to Stream Pakistani Content

పాకిస్థాన్ నుంచి రూపొందే ఎలాంటి కంటెంట్‌ను భారత్‌లో ప్రసారం చేయవద్దని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శ...

పాకిస్థాన్ వెబ్ సిరీస్‌లను భారత్‌లో ప్రసారం చేయవద్దు: నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం ఆదేశం

పాకిస్థాన్ నుంచి రూపొందే ఎలాంటి కంటెంట్‌ను భారత్‌లో ప్రసారం చేయవద్దని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశించింది. పాకిస్థాన్ మూలాలున్న వెబ్ సిరీస్‌లు భారత ప్రేక్షకులకు అందుబాటులో లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ అధికారిక వర్గాలు వెల్లడించాయి.

పాకిస్థాన్‌కు చెందిన 'జో బచే హైన్ సంగ్ సమైత్ లో' అనే వెబ్ సిరీస్ భారత్‌లో విడుదలయ్యే అవకాశం ఉందంటూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు అనేక ఫిర్యాదులు అందాయి. ప్రజల నుంచి పెద్దఎత్తున వినతులు రావడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. పాక్ ఆధారిత కంటెంట్ ప్రసారాన్ని భారత్‌లో నిరోధించాలని నెట్‌ఫ్లిక్స్‌కు స్పష్టం చేసింది.

గతంలో 2025 మే 8న జారీ చేసిన అడ్వైజరీకి నెట్‌ఫ్లిక్స్ తప్పనిసరిగా కట్టుబడి ఉండాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. పాకిస్థాన్‌లో రూపొందిన స్ట్రీమింగ్ కంటెంట్ భారత్‌లో అందుబాటులో లేకుండా ఉండేలా చూడాలని స్పష్టం చేసింది. ఆ సమయంలో నెట్‌ఫ్లిక్స్ ఇచ్చిన నిబద్ధతకు కట్టుబడి ఉండాలని, అప్పట్లో వ్యక్తం చేసిన వైఖరిని అలాగే కొనసాగించాలని అధికారులు ఆదేశించారు.

'జో బచే హైన్ సంగ్ సమైత్ లో' ప్రదర్శనకు సంబంధించిన అధికారిక ట్రైలర్ మంగళవారం విడుదలైంది. ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈ వెబ్ సిరీస్ డిసెంబర్ 4 నుంచి స్ట్రీమింగ్ కావాల్సి ఉంది.