అసోంలోని బొంగైగావ్ జిల్లాలో 13 మంది బంగ్లాదేశీయులను నవంబర్ 26వ తేదీన పోలీసులు అరెస్టు చేశారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి అక్రమంగా వలస వస్తున్...

అసోంలోని బొంగైగావ్ జిల్లాలో 13 మంది బంగ్లాదేశీయులను నవంబర్ 26వ తేదీన పోలీసులు అరెస్టు చేశారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి అక్రమంగా వలస వస్తున్న వారి కదలికలపై అందిన సమాచారం మేరకు పోలీసులు ఈ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు.
జోగిఘోపా పోలీసు స్టేషన్ పరిధిలోని నారాయణ సేతు వద్ద పోలీసులు ప్రత్యేక చెక్‌పోస్ట్ ఏర్పాటు చేశారు. నవంబర్ 26 తెల్లవారుజామున ఆటోల్లో జిల్లా సరిహద్దు దాటుతుండగా ఈ 13 మంది అక్రమ చొరబాటుదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టయిన వారిలో అహద్ అలీ (20), అమిన్ ఖాన్ (24), అమినుల్ ఇస్లాం (18), అషాదుల్ అలీ (25), ఇసారుల్ ఇస్లాం (24), జెమ్ షేక్ (21), మసారుల్ ఇస్లాం (22), మిగెన్ షేక్ (21), మిథోన్ షేక్ (26), ఎండీ రషెల్ అలీ (20), ఎండీ మోట్లేబ్ (20) సహా మొత్తం 13 మంది ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ చొరబాటుదారులు నారాయణ సేతు వద్ద ఆటోల్లో ఢిల్లీకి వెళ్తుండగా పట్టుబడ్డారని పోలీసులు తెలిపారు. వీరు బంగ్లాదేశ్‌లోని చపాయ్ నవాబ్‌గంజ్, రాజ్‌షాహి జిల్లాలకు చెందినవారని వెల్లడించారు.
వీరి వద్ద నుంచి నకిలీ భారతీయ గుర్తింపు కార్డులు లభించాయని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ 13 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.