ఐపీఎల్ వేలంలో సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండుల్కర్‌ను ముంబై ఇండియన్స్ తీసుకోవడంపై.. సోషల్ మీడియా వేదికగా విపరీతంగా చర్చ జరుగుత...
ఐపీఎల్ వేలంలో సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండుల్కర్‌ను ముంబై ఇండియన్స్ తీసుకోవడంపై.. సోషల్ మీడియా వేదికగా విపరీతంగా చర్చ జరుగుతోంది. సచిన్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది కాబట్టే..అర్జున్‌కు అవకాశం వచ్చిందంటూ ట్రోలింగ్ చేశారు కొందరు నెటిజన్లు. అయితే, దీనిపై క్లారిటీ ఇచ్చింది ముంబై ఇండియన్స్ యాజమాన్యం. అతనిలోని క్రీడా నైపుణ్యాల ఆధారంగానే కొనుగోలు చేశామని తెలిపింది.
రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం గురువారం జరిగిన వేలం పాటలో... మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్‌ను బేస్ ప్రైస్ 20లక్షలకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. దీంతో, సహజంగానే దీనిపై ట్రోలింగ్ మొదలైంది. సచిన్ కోసమే.. అర్జున్‌ను తీసుకున్నారంటూ విమర్శలు వచ్చాయి. దీనిపై స్పందించిన ముంబై ఇండియన్స్.. అదేమీ లేదని తేల్చి చెప్పింది.
అర్జున్ టెండూల్కర్‌లో ఉన్న నైపుణ్యం ఆధారంగానే.. ఎంపిక జరిగిందని చెప్పాడు ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేలా జయవర్ధనే. అర్జున్‌కు సచిన్ కుమారుడు అనే పెద్దట్యాగ్ ఉండటం సహజమనీ.. అయితే తాము బౌలింగ్ నైపుణ్యం ఆధారంగానే అతడిని ఎంపిక చేసుకున్నామనీ చెప్పాడు మహేల. సచిన్ మెప్పు పొందేందుకే తాము అర్జున్‌ను తీసుకున్నామన్న విమర్శల్ని కొట్టిపారేసింది ముంబై ఇండియన్స్. అర్జున్ సహజంగా లెఫ్టార్మ్ పేసర్, బ్యాట్స్‌మన్ కావడంతో తీసుకున్నామని ఆ ఫ్రాంఛైజీ యజమాని ఆకాశ్ అంబానీ స్పష్టం చేశారు.