Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

ఓయూ ఫ్రొఫెసర్ ఇంట్లో కుక్కల మృతి కలకలం.. Vandebharath

  Dogs Mystery deaths : అస‌లే క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్నవేళ కొత్త సంఘ‌ట‌న‌లు ప్రజ‌ల్ని మ‌రింత భ‌యాందోళ‌న‌కు గురిచేస్తున్నాయి. ఉన్నట్టు...



 Dogs Mystery deaths : అస‌లే క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్నవేళ కొత్త సంఘ‌ట‌న‌లు ప్రజ‌ల్ని మ‌రింత భ‌యాందోళ‌న‌కు గురిచేస్తున్నాయి. ఉన్నట్టుండి మూగ‌జీవాలు మృత్యువాత ప‌డుతుండ‌టం క‌ల‌వ‌రం రేపుతోంది. హైదరాబాద్ లోని అంబర్ పెట్ సోమసుందర్ నగర్ లో ఒక ఇంట్లో ఎదో తెలియని ఒక వైరస్ స్థానికులను భయ బ్రాంతులకు గురిచేస్తోంది. గత కొద్దిరోజులుగా ఓ ఇంట్లో నుంచి విపరీతమైన దుర్గంధం రావడంతో ఒక్కసారిగా భయపడ్డారు. ఏంటని అరా తీస్తే.. పేరో వైరస్‌తో పెంపుడు కుక్కలు చనిపోతున్నట్లు బయటపడింది. అయితే దీనంతటికీ కారణం ఓ ఫ్రొఫెసర్ తన బంగ్లాలో పెంచుకుంటున్న కుక్కలే అంటున్నారు స్థానికులు. .

హైదరాబాద్ మహానగరంలోని అంబర్‌పేట్ ప్రాంతానికి చెందిన సోమసుందర్‌నగర్‌లో సుష్మ అనే ఉస్మానియా యూనివర్సిటీ ఫ్రొఫెసర్ గత కొన్ని ఏళ్లుగా నివాసముంటున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో జంతుశాస్త్రంలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. స్రంఅయితే ఆమెకు కుక్కలంటే మహా ఇష్టం. దీంతో ఆమె వీధి కుక్కలను చేరదీసి పెంచుకుంటున్నారు. ఇలా దాదాపు 12 కుక్కలను ఎలాంటి పరిమిషన్ లేకుండా ఇంట్లో సాకుతున్నారు. దీంతో రాత్రుల్లో కుక్కల అరుపులకు స్థానికులకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తున్నాయి. గతంలో స్థానికులు పలుమార్లు మునిసిపల్ అధికారులకు, స్థానిక నేతలకు పిర్యాదు చేసారు. కానీ ఫలితం లేదు.

ఇదిలావుంటే, నాలుగు రోజుల కిందట పెంపుడు కుక్కల్లోని మూడు కుక్కలు చనిపోయాయి. అయితే వీటిని మున్సిపల్ అధికారులకు అప్పగించకుండా ఇంటిలోనే ఉంచడంతో ఒక్కసారి దుర్వాసన ఆ ప్రాంతమంతా వ్యాపించింది. దీనిపై ఆగ్రహించిన స్థానికులు ఆమె ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు.