Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

జల్గావ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - Vandebharath

  హైదరాబాద్ :  మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం 15మందిని బలితీసుకుంది. ఈ విషాద ఘటనపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప...

 

హైదరాబాద్ : మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం 15మందిని బలితీసుకుంది. ఈ విషాద ఘటనపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు.
ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. ఈ వార్త విని తన మనసు ఎంతగానో బాధపడిందని తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది.
ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే రూ. 2లక్షల పరిహారం ప్రకటించారు. మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది అక్కడికక్కడే మరణించారు. పొప్పడికాయల లోడ్తో వెళ్తున్న లారీలో 15మంది కూలీలు ప్రయాణిస్తున్నారు. ధూలే నుంచి జల్గావ్కు బయలుదేరిన లారీ అర్ధరాత్రి ఒంటిగంటకు కింగోన్ సమీపంలో బోల్తా కొట్టింది.

ఆ సమయంలో వైద్య సహాయం అందక మృతుల సంఖ్య పెరిగినట్టు తెలుస్తోంది. లారీలో ప్రయాణిస్తోన్న 15 మంది కూలీలు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. డ్రైవర్ సహా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

మృతుల్లో 5సంవత్సరాల లోపు చిన్నారులు ఇద్దరు.. 15ఏళ్ల బాలిక ఉన్నారు. గాయపడిన వారందరినీ.. జల్గావ్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జల్గావ్ జిల్లా రావీర్ పరిధి.. అభోదా, వివ్రా, కెర్హలా గ్రామాలకు చెందిన మృతులంతా రోజువారీ కూలీలుగా పనిచేస్తుంటారని పోలీసులు వివరించారు.