Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

డ్రైనేజీలో తండ్రి అస్థికలు కలిపిన కొడుకు.. కారణం? - Vandebharath

  లండన్‌ :  జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి అన్న సామెతకు చక్కటి ఉదాహరణ బ్రిటన్‌కు చెందిన కెవిన్‌ మెక్‌గ్లిన్చి అనే 66 ఏళ్ల వ్యక్తి. పబ్‌ అంటే ...

 

లండన్‌ : జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి అన్న సామెతకు చక్కటి ఉదాహరణ బ్రిటన్‌కు చెందిన కెవిన్‌ మెక్‌గ్లిన్చి అనే 66 ఏళ్ల వ్యక్తి. పబ్‌ అంటే ఇష్టపడే ఈ పెద్ద మనిషి తన చివరి కోరికతో ఫ్యామిలీని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. కెవిన్ అడిగింది పిచ్చి కోరికైనా.. చివరి కోరిక కాబట్టి ఆయన ఆత్మకు శాంతి కలగాలని దాన్ని నెరవేర్చింది ఫ్యామిలీ. వివరాలు.. కెవిన్‌ మెక్‌గ్లిన్చికి కోవెంట్రీలోని ‘హోలీ బుష్‌’ పబ్‌ అంటే ఎంతో ఇష్టం. ప్రతీ రోజు అక్కడికి వెళ్లేవాడు. చల్లగా ఓ గ్లాసు బీరు పుచ్చుకునేవాడు. చావు దగ్గర పడ్డ కొద్దిరోజుల ముందు కుటుంబసభ్యుల్ని ఓ పిచ్చి చివరి కోరిక కోరాడు. తను చనిపోయిన తర్వాత అస్థికలను పబ్‌ ముందున్న డ్రైనేజీలో కలపాలన్నాడు. దీంతో ఆ కుటుంబసభ్యులు మొదట ఆశ్చర్యపోయినా తర్వాత అతడి కోరికను అర్థంచేసుకున్నారు. మొదటి జయంతి రోజున కెవిన్‌ కుమారుడు ఓవెన్‌, కూతురు కాస్సిడీ ఇతర కుటుంబసభ్యులు హోలీబుష్‌ పబ్‌ దగ్గరకు చేరుకున్నారు.

ఓవెన్‌ తండ్రి అస్థికలను ఓ గ్లాసు బీరులో కలిపి, దాన్ని పబ్‌ముందున్న డ్రైనేజీలో పారబోశాడు. దీంతో తండ్రి చివరి కోరిక తీరింది. దీనిపై ఓవెన్‌ మాట్లాడుతూ.. ‘‘ మా నాన్నకు హోలీ బుష్‌ పబ్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. ప్రతీ రోజు అక్కడికి వెళ్లేవాడు. అక్కడి డ్రైనేజీలో తరచూ ఏదో ఒకటి పాడేసేవాడు. అవి ఎలాంటివంటే జుట్టు, గోర్లు లాంటివి. డ్రైనేజీలో ఆయన తన అస్థికలు ఎందుకు కలపమన్నారంటే.. మేము అటువైపు వెళ్లిన ప్రతీసారి గుర్తుకురావాలన్న ఉద్దేశ్యంతో’’ అని పేర్కొన్నారు.